|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 05:26 PM
ప్రస్తుతం భారతీయ ప్రేక్షకులను భారీ కంటెంట్, లెక్కకు మించి జాతీయ, అంతర్జాతీయ సిరీస్‌లు, సినిమాలను ప్రతి ఇంటిలోకి తీసుకువచ్చి అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపు దక్కించుకున్న ఏకైక డిజిటల్ ఫ్లాట్‌ఫాం అమోజాన్ ప్రైమ్ వీడియో. దానికి ముందు దాని తక్వాత అనేక ఓటీటీలు వచ్చినా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. కరోనా రాక మునుపు వార్షిక రుసుము కేవలం రూ.300తో మైదలైన ఈ ఓటీటీ ఆ తర్వాత రూ. 500, ఆపై ఇప్పుడు రూ.1500కు చేరింది అయినా వీటికి బాగా అలవాడు పడిన కుటుంబాలు ఇంటి రోజు వారి ఖర్చులో రూ.500 తగ్గించుకుంటున్నారు గానీ అమెజాన్ సబ్‌స్క్రిప్సన్ లేకుండా అయితే ఉండడం లేదు. అంతగా మన జనం అడిక్ట్ అయిపోయారు.అయితే తాజాగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రేక్షకుల నెత్తిన ఓ బాంబ్ వేయడానికి సిద్ధమైంది. రానున్న జూన్ 17 2025 నుంచి ప్రతి సీరీస్, సినిమాల మధ్యలో ప్రకటనలు టెలికాస్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఓ లెటర్ సైతం విడుదల చేసి తమ పాలసీలో మార్పులు జరిగినట్లు తెలిపి ఈ క్రింది వివరాలు వెల్లడించారు. ‘ప్రియమైన ప్రైమ్ మెంబర్.. జూన్ 17, 2025 నుంచి, ప్రైమ్ వీడియో సినిమాలు మరియు టీవీ షోలలో పరిమిత ప్రకటనలు ఉంటాయి. తద్వారా వచ్చే ఆదాయంతో మిమ్మల్ని మరింతగా అలరించే, ఆకట్టుకునే మంచి కంటెంట్ అందించడానికి దోహదం చేస్తుందని తెలిపారు.
Latest News