|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 05:53 PM
నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన సూటి వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ తనదైన శైలిలో మాట్లాడుతూ ఉండే ఆయన, తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉంటాయా అని నెటిజన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, బండ్ల గణేశ్ తన ఎక్స్ ఖాతాలో, “అది పీకుతా, ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు. మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు” అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని, ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.
Latest News