|
|
by Suryaa Desk | Fri, Sep 26, 2025, 07:14 PM
‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రంలోని ‘వీరా రాజ వీరా’ పాటపై కాపీరైట్ కేసులో సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్‌కు ఊరట లభించింది. తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పాట జాహిరుదీన్ డగర్ సోదరులు కంపోజ్ చేసిన శివస్తుతి పాటను పోలి ఉందని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నేడు ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. దీనిపై రెహమాన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి తీర్పును పక్కన పెడుతున్నట్లు తెలిపింది.
Latest News