|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 07:41 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ సోమవారం శివైక్యం చెందారు. ఈ వార్త విని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వామివారి సేవలో నిత్యం నిమగ్నమై, భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించిన మహోన్నత వ్యక్తి మనల్ని విడిచి వెళ్లడం తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు విప్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.