|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 12:07 PM
తెలంగాణలో ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత మళ్లీ పెరగనుందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని, గజగజ వణికించేలా చలిగాలులు వీస్తాయని, డిసెంబర్ మొదటి వారంలో ఉన్నటువంటి 'కోల్డ్‌వేవ్' పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయని హెచ్చరించింది. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని, ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావొద్దని హెచ్చరించింది.