|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 11:57 AM
TG: మహిళా సంఘాలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. మహిళా సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అసెంబ్లీలో వెల్లడించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా ఏటా రూ.20 వేల కోట్లు సహాయం అందిస్తున్నామని చెప్పారు. అలాగే కోటి మంది మహిళలకు చీరల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.