|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 11:28 AM
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై వనస్థలిపురం నుంచి హయత్నగర్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్టాండ్ సమీపంలో రోడ్డు పనులు, రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీనితో స్కూల్, కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు, అంబులెన్సులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు, వాహనాలను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.