|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 10:13 AM
ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం విమానాశ్రయంలో తొలి విమాన పరీక్ష విజయవంతమైందని, త్వరలో వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ విమానాశ్రయాలు యువతకు మెరుగైన కనెక్టివిటీ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ గొప్ప విజయాలు సాధిస్తోందని, దేశాన్ని ఐక్యంగా, బలంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉందని అన్నారు.