|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 02:42 PM
తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ మేరకు రేపటి (జనవరి 5) నుంచి 12వ తేదీ వరకు తీవ్ర చలిగాలులు వీస్తాయని వెల్లడించారు. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయని పేర్కొన్నారు. పగలు ఉష్ణోగ్రతలు 25-26 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు. కాగా కొన్ని రోజులుగా ఉదయంపూట పొగమంచు ఉంటున్నా చలి తీవ్రత తగ్గిన సంగతి తెలిసిందే.