|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 03:47 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్య పల్లి గ్రామంలో కొలువైన శ్రీ దుబ్బ రాజ రాజేశ్వర స్వామి వారి మాఘమాస అమావాస్య జాతర ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న సందర్భంగా జాతర పోస్టర్‌ను ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ జాతర భక్తుల విశ్వాసాలకు, గ్రామీణ సంప్రదాయాలకు ప్రతీక అని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.