|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 01:54 PM
తిరుమలాయపాలెం గ్రామంలో సోమవారం ఉదయం కంకర్ లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. హైవే నుంచి సంత రోడ్డుకు మూల తిరుగుతున్న క్రమంలో లారీ రోడ్డు క్రాస్ అయ్యింది. పక్కనే ఉన్న 3 ఫేస్ విద్యుత్ స్తంభం విరిగి తీగలు లారీపై పడ్డాయి. డ్రైవర్ సకాలంలో లారీ నుంచి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. విరిగిన స్తంభం సపోర్టుతో లారీ కింద పడకుండా ఆగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.