|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:15 PM
2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. తెలంగాణలో డిసెంబర్ నెల మొత్తం ఆదాయం రూ. 5,051 కోట్లకు చేరగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రూ. 2,020 కోట్ల విక్రయాలు జరిగాయి. ఏపీలోనూ గడిచిన మూడు రోజుల్లో రూ. 543 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. దేశవ్యాప్త గణాంకాల ప్రకారం, మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, గుర్గావ్‌లలో యువత మద్యం మత్తులో రోడ్లపై ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌లోని పబ్బులు, ఈవెంట్లలో యువతీయువకులు పెద్ద ఎత్తున మద్యం తాగి సందడి చేశారు. జనవరి 1వ తేదీన ఒక్కరోజే తెలంగాణలో దాదాపు రూ. 700 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.