|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 03:01 PM
మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో సజ్జనార్ మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కీలక సూచనలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు.మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాలను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అతివేగంగా, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకలను ఒక మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని, విషాదంగా మార్చుకోవద్దని హితవు పలికారు.