|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 01:39 PM
ఐబొమ్మ రవి వ్యవహారం రోజురోజుకు మరింత సంచలనంగా మారుతోంది. పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో అతడి అక్రమ కార్యకలాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఐబొమ్మ రవి సుమారు రూ.13 కోట్ల వరకు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆదాయంలో దాదాపు రూ.10 కోట్లను పూర్తిగా విలాసవంతమైన జీవనశైలికే ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఖరీదైన పబ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, లగ్జరీ ప్రయాణాలు... ఇలా హైఫై లైఫ్ గడపడమే అతడి ప్రధాన లక్ష్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రవి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సుమారు రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.దర్యాప్తులో మరో షాకింగ్ విషయం ఏమిటంటే… ఐబొమ్మ రవికి పైరసీపై ఆసక్తి ఇప్పటిది కాదు. 2007 నుంచే అతడికి ఈ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచే తన స్నేహితుల సర్టిఫికెట్లు, ఐడెంటిటీ డాక్యుమెంట్లను వారి తెలియకుండానే దొంగిలిస్తూ అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. ప్రహ్లాద్, అంజయ్య, కాళీ ప్రసాద్ వంటి వ్యక్తుల ఆధార్, పాన్ వంటి కీలక పత్రాలను సేకరించి... వాటిపై తన ఫొటోను అతికించి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. ముఖ్యంగా ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తెరిచినట్లు పోలీసులు నిర్ధారించారు.