|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 03:23 PM
వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో పటాన్‌చెరు నియోజకవర్గం ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి–సమృద్ధులతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజాసేవనే పరమధర్మంగా భావిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే శక్తిని, సంకల్పబలాన్ని స్వామివారు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.