|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 02:35 PM
సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా సంక్షేమ కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే బీసీ ఫెడరేషన్ కులాల సమస్యలపై సలహాలు, సూచనల కోసం నాలుగు నాన్-అఫీషియల్ సభ్యులను గుర్తించి, మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, బీసీ జేఏసీ నాయకులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ జీఓ ఎంఎస్ నంబర్ 9 ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేయాలని, సామాజిక వర్గానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వం మార్చి 12, 2024న రాష్ట్ర క్యాబినెట్‌లో ఆమోదించిన 11 ఫెడరేషన్లకు, 2 కార్పొరేషన్లకు వెంటనే చైర్మన్లను నియమించాలని కూడా ప్రభుత్వానికి కోరాలని విజ్ఞప్తి చేశారు.