|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 02:37 PM
తెలంగాణలోని గద్వాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. రక్షించాల్సిన తండ్రే భక్షకుడిగా మారి కన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మైనర్ అని కూడా చూడకుండా లైంగిక దాడి చేసి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ పాపానికి నిందితుడి మొదటి భార్య సహకరించడమే కాకుండా, బాలికకు అబార్షన్ చేయించి విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. పిల్లలు పుట్టకపోవడంతో భార్య చెల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు పుట్టగా, అనంతరం మొదటి భార్యకు కూడా ఇద్దరు పిల్లలు కలిగారు. అందరూ కలిసి ఒకేచోట ఉంటున్నారు. అయితే, ఆ వ్యక్తి వక్రబుద్ధితో తన రెండో భార్య కూతురు (16)పై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం నిందితుడి మొదటి భార్యకు తెలిసింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె.. భర్తను మందలించాల్సింది పోయి అతనికి సహకరించింది. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించింది.అయితే, బాధితురాలు ఇటీవల తన నరకయాతనను స్థానికంగా ఉండే ఓ మహిళకు చెప్పుకుని కన్నీరుమున్నీరైంది. దీంతో ఆ మహిళ వెంటనే బాలిక తల్లికి సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.