|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 02:07 PM
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లు రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు అవసరాన్ని బట్టి మూసివేస్తామని ఇంచార్జి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ వంటి చోట్ల రాత్రి 11 నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధించారు. 217 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి ఎనిమిది గంటల నుంచే కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.