|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 03:07 PM
మద్యం సేవించి వాహనాలు నడిపే వారి వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ పార్టీల్లో మద్యం తాగిన వారు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు ఉచిత రవాణా సేవలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు డిసెంబర్ 31 రాత్రి (ఈ రోజు) 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఎక్కడైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాబ్‌లు, ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లతో కలిపి మొత్తం 500 వాహనాలను సిద్ధం చేసినట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. పార్టీల అనంతరం సురక్షితంగా ఇంటికి వెళ్లాలనుకునే వారు, తమకు ఉచిత రైడ్ కావాలని కోరుతూ 8977009804 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్ధాలను నివారించి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రధాన ఉద్దేశమని టీజీపీడబ్ల్యూయూ పేర్కొంది.