|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 11:30 AM
ఇటీవల పెద్దపెల్లి జిల్లాలో ఓ వ్యక్తిని అక్కచెల్లెళ్లు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుర్ర మహేందర్‌గౌడ్ (33) ఇన్‌స్టాగ్రామ్‌లో సంధ్య ఐడీతో జగిత్యాల పట్టణానికి చెందిన బైరవేని సమతతో స్నేహం చేశాడు. తనది ఒకటే కులమని, పెళ్లి కాలేదని నమ్మించి, సమత సోదరి సంధ్య ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆమె వాట్సప్ గ్రూప్‌లో చేర్చాడు. సమతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి, తననే పెళ్లి చేసుకోవాలని లేదంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి పంపిస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో, సంధ్య, సమతలు తమ మేనమామ నరేశ్‌కు విషయం చెప్పగా, ఆయన, సంధ్య కొడుకు రాజశేఖర్, అతని స్నేహితులతో కలిసి మహేందర్‌ను హత్య చేయాలని పథకం పన్నారని పోలీసులు వెల్లడించారు.