|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:54 PM
శనివారం తల్లాడమండలం అంబేద్కర్ నగర్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి తల్లాడ వైపు వస్తున్న ఫార్చునర్ వైట్ కారు, తల్లాడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న నెక్సన్ బ్లూ కలర్ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నెక్సన్ కారు డ్రైవర్ తలకు గాయాలవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.