|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 01:30 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు డిమాండ్‌తో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి ధ్యానపల్లి పరమేష్‌తో సహా పలువురు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 22 నెలలుగా సుమారు 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను ఏకమొత్తంగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.