|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 11:26 AM
వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) జనవరి 27న బ్యాంకుల బంద్‌కు పిలుపునిచ్చింది. జనవరి 25న ఆదివారం సెలవు, 26న రిపబ్లిక్ డే కావడంతో, 27వ తేదీతో కలిపి వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. నిత్యం బ్యాంకు లావాదేవీలు నిర్వహించేవారు ఈ విషయాన్ని గమనించి, తమ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.