|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 12:32 PM
మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీలో కొత్తగా చేరినవారు పెత్తనం చెలాయించడం, టికెట్లు పంచుకోవాలని చూడటం సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలిపితే స్వాగతిస్తామని, కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.