|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:57 PM
జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో ముత్తారం మండలం దరియాపూర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పరకాలలో జరిగిన ఈ పోటీల్లో, కటా విభాగంలో 25 బంగారు, 5 వెండి, 3 కాంస్య పతకాలు, కుమితే విభాగంలో 4 బంగారు, 4 వెండి పతకాలు సాధించి పాఠశాలకే కాకుండా జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం ఎంఈవో హరి ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ కేసరిలు విద్యార్థులను, శిక్షకులను అభినందించారు.