|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 06:01 PM
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు బంధించిన ఉదంతంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, స్పందించారు. ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సైన్యాన్ని పంపి మదురోను బంధించగలిగితే, మోదీ కూడా పాకిస్తాన్‌లోకి సైన్యాన్ని పంపి 26/11 ముంబై ఉగ్రదాడుల మాస్టర్‌మైండ్ ఉగ్రవాదులను భారత్‌కు ఎందుకు తీసుకురాలేరని ప్రశ్నించారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు లేదా జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ వంటి వారిని పాకిస్తాన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చే ధైర్యం మోదీకి ఉందా అని నిలదీశారు.