|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:07 PM
అర్చకుల సమస్యల పరిష్కారం కోరుతూ నల్లగొండలో శుక్రవారం చైతన్య యాత్ర నిర్వహించారు. దూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించారు. అర్చకులకు కనీస వేతనం రూ.35 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, ఐడీ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు. పునశ్చరణ తరగతులు నిర్వహించాలని, అర్చక భవనం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు