|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 12:25 PM
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండలగూడలో గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ కేతకీ రేణుకా ఎల్లమ్మ సమేత మల్లిఖార్జున స్వామి (బండల మల్లన్న) జాతర మహోత్సవానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, బండల మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని, ఇలాంటి జాతర మహోత్సవాలు మన సంస్కృతి–సంప్రదాయాలను తరతరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.