|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:25 PM
ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో భావోద్వేగంగా ప్రసంగించారు. తన కుటుంబంలో ఆస్తుల గొడవలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇది ఆస్తుల పంచాయితీ కాదని, తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. తన ఇద్దరు కుమారులపై ప్రమాణం చేసి చెబుతున్నానని, రాజకీయ లబ్ధి కోసం కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టేలా అసత్య ఆరోపణలు చేయడం తగదని కవిత కంటతడి పెట్టుకున్నారు.