|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 11:01 AM
జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్, టీజీవో, టీఎన్జీవో, టేబుల్ క్యాలెండర్లను ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వినియోగదారులు ఉద్యోగులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిహెచ్ఏంసి పరిధి పెరిగిగిన నేపథ్యంలో.. జలమండలి పరిధి సైతం జిహెచ్ఏంసి విస్తీర్ణం వరకు పెరుగుతుందని, దానివల్ల బాధ్యత పెరుగుతుందని అన్నారు. దానికి అనుగుణంగా ఈ కొత్త సంవత్సరంలో కొత్త బాధ్యతలు నిర్వహించడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈడీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ.. జలమండలి ఉద్యోగులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు ఉద్యోగులు గతేడాది వేసవిలో సమర్థంగా పనిచేశారని చెప్పారు. ఈ సారి సైతం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, పర్సనల్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్, ఆపరేషన్ డైరెక్టర్ వినోద్ భార్గవ, జేఈఏ అధ్యక్షుడు రాజశేఖర్, టీజీవో జనరల్ సెక్రటరీ చంద్రజ్యోతి, టీఎన్జీవో జలమండలి శాఖ అధ్యక్షుడు మహేష్ కుమార్, జనరల్ సెక్రటరీ అజయ్ సింగ్, యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.