|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 03:44 PM
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పౌల్ట్రీ రైతులకు విధించిన ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై బుధవారం షాద్‌నగర్ పౌల్ట్రీ రైతులు, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పాతూరి వెంకటరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుదే వసంతరావు, మక్కాపాటి మల్లేశ్వర రావు, కొర్రపాటి శ్రీనివాస రావు, మలినేని సాంబశివ రావు, కొడాలి సురేష్, మలినేని శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.