|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 04:06 PM
చేవెళ్ళ నియోజకవర్గంలో బుధవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రావులపల్లి నుంచి పిఎసిఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, సీనియర్ నాయకులు కటికే నర్సింగ్ రావు, కె. మధు, లక్ష్మన్ కుమార్, బూర్ల మల్లేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారికి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పి. ప్రభాకర్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పి. కృష్ణా రెడ్డి కూడా పాల్గొన్నారు.