|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 03:42 PM
పెద్దపల్లి జిల్లాలో గ్రామాలను పరిశుభ్ర గ్రామాలుగా మార్చేందుకు నవంబర్ 1 నుంచి 7 వరకు ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో పంచాయతీ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఆయన, గ్రామాలలో ప్లాస్టిక్, చెత్త లేకుండా చూడాలని, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు నిర్దిష్ట షెడ్యూలు పాటించాలని సూచించారు.