|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 03:34 PM
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్లే ప్రయాణికులు తెల్లవారుజామున, రాత్రి వేళల్లో క్యాబ్ డ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. యాప్‌లో చూపిన ధర కంటే రెండింతలు, మూడింతలు అడుగుతున్నారని, రూట్ సమస్య ఉందని చెప్పి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, ఇది పెద్ద స్కామ్ అని, క్యాన్సిల్ చేసి మళ్లీ బుక్ చేసుకోవాలని, కొందరు డ్రైవర్లు గ్రూప్ చాట్‌లలో రేట్లు పెంచుతున్నారని కూడా ప్రస్తావించారు. ఈ దోపిడీపై అధికారులు, క్యాబ్ కంపెనీలు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.