|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 02:04 PM
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ బలహీనపడి ఆకస్మికంగా దిశ మార్చుకొని తెలంగాణ వైపు దూసుకొస్తోందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలహీన పడిన మొంథా తుపాన్.. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీల దూరంలో కేంద్రీకృతం అయిందని తెలిపింది. దీంతో తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. హనుమకొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.