|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 07:50 PM
శంకర్ పల్లిలోని మిర్జాగూడ ఎంఎస్ కే గార్డెన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న డి. శంకర్ సింగ్ (48) అనే వ్యక్తిని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆటో (టీఎస్ జీరో సెవెన్ యు ఎల్ 2558) ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మోకిలా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మోకిల సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు తెలిపారు.