|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 07:45 PM
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శుక్రవారం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డితో సహా పలువురు సీపీఐ నాయకులను హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు అందిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు.