|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 02:57 PM
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. అయితే తాజాగా రాజకీయంగా ప్రజాక్షేత్రంలో కనిపించని కేసీఆర్, ఈ ఉప ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టనున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ నాయకులకు వ్యూహాలపై దిశా నిర్దేశం చేస్తున్న మాజీ సీఎం, ఇక ప్రచారంలోనూ పాల్గొంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అక్టోబర్ 19న భారీ స్థాయిలో రోడ్డు షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోన్నారట.