|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 03:33 PM
వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం 82,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు అధికారులు 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 40,643 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 43,351 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030 క్యూసెక్కులు, కుడి కాలువకు 600 క్యూసెక్కులు, మొత్తం 85,694 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ అధికారి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, నీటిమట్టం 318 అడుగులకు గాను 317 అడుగులకు చేరుకుంది. 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది మరియు 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉంది.