|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 02:55 PM
ఆల్మట్టి ఎత్తు పెంచితే ఉమ్మడి పాలమూరుకు అత్యంత ప్రమాదకరమని, పాలమూరుకు బతుకుదెరువే వ్యవసాయమని, అలాంటి జిల్లా ఎడారిగా మారుతుం దని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పార్టీలకు అతీతంగా ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని పిలు పునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాం మ్మోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్‌రె డ్డిలతో కలిసి మాట్లాడారు. ఇది వరకు పోతిరెడ్డిపాడు తోనే తీవ్ర నష్టం జరిగిందని, ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచి 100 టీఎంసీల నీ టిని నిలుపుకునేందుకు లక్షన్న ర ఎకరాల భూసేకరణకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దీనిపై పోరాటం చేయకపోతే జిల్లాకు తీరని అ న్యాయం జరుగుతుందన్నారు. అన్ని పార్టీలు కలిసి కేం ద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళి పోరాడదా మని పిలుపునిచ్చారు.