|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:40 PM
వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల జలాశయానికి కర్ణాటక నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం జలాశయానికి 3.67 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, అధికారులు 34 గేట్లు ఎత్తి 3.67 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 317 మీటర్లకు చేరుకుంది. జలాశయంలో 6.598 టీఎంసీల నీరు నిల్వ ఉంది.