|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:24 PM
కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో కాళికామాత అమ్మవారిని శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు.