|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:21 PM
TG: ‘హైడ్రా.. ఒకటి రెండేళ్లకు పరిమితం కాదు. వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తోంది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం ఆరు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. సీఎస్‌ఆర్ పేరుతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. చెరువుల వద్ద భూముల ధరలు రూ.కోట్లు పలుకుతున్నాయి. వీటితో పాటు నాలాలను నోటిఫై చేస్తున్నాం’ అని రంగనాథ్ తెలిపారు.