|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 02:35 PM
TG: సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన ఎన్నో కుంటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఘటన జరిగి 48 గంటలు గడుస్తున్నా.. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియక బాధితుల బంధువులు తల్లడిల్లిపోతున్నారు. కళ్ల నిండా నీళ్లు, గుండె నిండా బాధతో పరిశ్రమ గేటు వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఊరు తెలియదు, భాష రాదు.. అయినా తమ వారి కోసం చేతిలో ఫొటోలను పట్టుకుని రోదిస్తున్నారు. "మా వాళ్లు ఎక్కడ ఉన్నారో దయచేసి చెప్పండి" అంటూ అధికారులను వేడుకుంటున్నారు.