|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 02:09 PM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బిహార్ వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చిన మైనర్ బాలిక.. వాటర్ బాటిల్ కొనేందుకు వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు.