|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 04:39 PM
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. జూన్ 15వ తేదీ ఆదివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,680 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,250 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,20,000 పలుకుతోంది. బంగారం ధరలు విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులే కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి.చరిత్రలోనే తొలిసారిగా బంగారం ధర లక్ష రూపాయలు దాటి ఆల్టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేసి ముందుకు వెళుతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని దాటింది. ఈ నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఈ పరిణామం కాస్త ఇబ్బందికరమైన అని చెప్పవచ్చు. ఎందుకంటే 22 క్యారెట్ల బంగారం ధర కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 93 వేల రూపాయలు దాటింది. ఈ స్థాయిలో బంగారం ధర పెరగడం అనేది ఇది తొలిసారి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు ఇకపై కొనుగోలు చేయాలంటే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే పసిడి ప్రియులకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లో ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర 3452 డాలర్లు దాటింది. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణమని చెప్పవచ్చు. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోవడమే ఒక కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా భావించే బంగారం వైపు తరలిస్తున్నారు. దీంతో బంగారానికి ఒకసారిగా డిమాండ్ పెరిగి పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచన చేస్తున్నారు. ముఖ్యంగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయిని దాటి ముందుకు దూసుకెళ్తున్నాయి ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడిన మీరు పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.