|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 04:32 PM
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ తరువాత రేవంత్ పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేసీఆర్, కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న వేళ.. రాజకీయంగా తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రేపు (సోమవారం) జరిగే మంత్రివర్గ భేటీలో సంచలన నిర్ణయానికి సిద్దమయ్యారు. ఇదే సమయంలో రేవంత్ఎన్నికల సమరం తెలంగాణలో ఆసక్తి కర పోరుకు సర్వం సిద్దం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొంత కాలంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన కీలక మంత్రాంగం సాగుతోంది. రేపు (సోమవారం) జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నిక ల పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో ఇక ఈ అంశం పైన స్పష్టత వస్తోంది. ముందుగా జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతున్నారు. కేబినెట్ భేటీలో పూర్తి స్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సరైన సమయం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయంగా సీఎం రేవంత్ భావిస్తున్నారు. తాజా గా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. కుల గణన తరువాత క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కు ఆశాజనంగా పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో వ్యూహాత్మకంగానే సామాజిక సమీకరణాలు అమలు చేసారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామా లు.. అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్ వరుసగా విచారణలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల నిర్వహణ విషయంలో పై చేయి సాధించవచ్చనే అంచనాలతో ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ నిర్వహణ తరువాత గ్రామ పంచాయితీ.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది. గెలుపు పై ధీమా అదే సమయంలో రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉండనుంది. ఇక.. జూలైలోనే ఎన్నికల నిర్వహణ పై భేటీలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లు అమలు.. తాజాగా నాలుగు పథకాలను అమలు చేయటం ప్రారంభించటంతో ప్రస్తుత గ్రామీణ వాతావరణం రాజకీయంగా తమకు అనుకూలంగా ఉందనే అంచనాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీంతో, ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన గ్రామీణ ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీంతో, ఇప్పుడు ఎన్నికల సమరం తెలంగాణలో మరోసారి రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.