|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 05:04 PM
రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో బోజగుట్ట మరియు నాంపల్లి నియోజకవర్గాల్లో 2BHK పథకానికి అర్హులైన 520 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి గృహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఇంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి పంజాగుట్ట నుండి లక్డికపూల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల్లో గృహ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఉదయం మంత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలపై అధికారులను సమీక్షించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నగరంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే ఇళ్ల పథకాన్ని విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.