|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 12:35 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న విడుదల కానున్న సందర్భంగా హీరో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు.సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ... 'కిష్కింధపురి' తనకెంతో ఇష్టమైన హారర్, మిస్టరీ జానర్‌లో చేసిన మొదటి సినిమా అని సాయి శ్రీనివాస్ అన్నారు. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు. సినిమా చూసిన తర్వాత తాను అవాక్కయ్యాయని, ముఖ్యంగా సౌండ్ డిజైన్ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని అన్నారు. రాక్షసుడు తర్వాత ఇలాంటి విభిన్నమైన సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమాపై చాలా నమ్మకం ఉందని చెప్పారు.నిర్మాత సాహు గారపాటి గురించి మాట్లాడుతూ.. బడ్జెట్‌తో రాజీ పడకుండా అత్యుత్తమ సాంకేతిక విలువలతో సినిమా నిర్మించారని, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి అద్భుతమైన కథను సిద్ధం చేశారని, అనుపమ పరమేశ్వరన్ నటన చాలా కష్టమైనదని, ఆమె అద్భుతంగా నటించిందని కొనియాడారు.ఈ సినిమాలో కథలోనే యాక్షన్ ఉందని, మొత్తం ఆర్గానిక్‌గా తీసిన సినిమా అని తెలిపారు... హారర్, మిస్టరీ రెండూ కలగలిపి ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పారు. వింటేజ్ రేడియో సెట్, రియల్ వాంటెడ్ హౌస్‌లో షూటింగ్ చేయడం వంటివి సినిమాకు మరింత సహజత్వాన్ని తెచ్చాయన్నారు. టీనేజ్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తారని, సినిమాలోని తీవ్రత కారణంగా 'A' సర్టిఫికేట్ వచ్చిందని చెప్పారు.సాయి శ్రీనివాస్ తన రాబోయే ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు.. ‘టైసన్ నాయుడు’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, ‘హైందవ’ షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలిపారు. అలాగే, ‘పొలిమేర’ దర్శకుడు అనిల్‌తో ఒక కొత్త థ్రిల్లర్ చేయబోతున్నట్లు వెల్లడించారు. తాను ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటానని, తనను తాను నిరూపించుకోవాలనే కసి పెరిగిందని తెలిపారు.
Latest News