|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 10:55 AM
తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న విడుదల కానున్న సందర్భంగా చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రితికా నాయక్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలను పంచుకున్నారు.రితికా నాయక్ మాట్లాడుతూ...తన మొదటి సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్నప్పుడు మిరాయ్ అవకాశం వచ్చిందని రితికా నాయక్ చెప్పారు. ఇందులో తాను హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ పాత్రలో చాలా శక్తివంతమైన క్యారెక్టర్ చేశానని, సినిమా ఆడియన్స్ కి యాక్షన్, అడ్వెంచర్ గొప్ప అనుభూతిని ఇస్తుందని తెలిపారు. తేజ సజ్జా చాలా ప్రొఫెషనల్, డెడికేటెడ్‌గా పని చేస్తారని, ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. మనోజ్ మంచు, జగపతిబాబు,శ్రీయ వంటి అద్భుతమైన నటీనటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ సినిమాలోని దాదాపు 80% సన్నివేశాలను లైవ్ లొకేషన్స్‌లో షూట్ చేశామని, ఇది చాలా కష్టమైనప్పటికీ, టీమ్ సభ్యుల సహకారంతో ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని ఆమె అన్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి గొప్ప విజన్ ఉందని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని తెలిపారు.తనకు హారర్, యాక్షన్, రొమాన్స్ జానర్స్ చాలా ఇష్టమని, ముఖ్యంగా సాయి పల్లవి తన స్ఫూర్తి అని రితికా నాయక్ తెలిపారు.హనుమాన్ తనకు ఇష్టమైన సినిమా అని, భవిష్యత్తులో కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేస్తున్నానని, మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
Latest News